ఉంగుటూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో గొల్లగూడెం చేరుకోనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభా ప్రాంగణానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధర్మరాజు, బాలరాజు కూడా పాల్గొన్నారు.