నిడమర్రు మండలం చిన నిండ్రకొలను గ్రామంలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులతో కలిసి అర్హులైన వృద్ధులు, వికలాంగులకు వారి ఇంటి వద్దకే నేరుగా వెళ్లి పెన్షన్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మరాజు, పేద ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వికలాంగులు మరియు పూర్తిస్థాయి వైకల్యం కలిగిన వారికి పెన్షన్ మొత్తాన్ని పెంచి, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తామని ఆయన తెలిపారు.