నిడమర్రు మండలం అడవికొలను గ్రామంలో నేడు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వృద్ధాప్య పెన్షన్‌ను రూ. 4,000లకు, వికలాంగుల పెన్షన్‌ను రూ. 6,000లకు, పూర్తి వైకల్యం కలిగిన వారికి రూ. 15,000లకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రూ. 10,000లకు పెంచి పేదల జీవితాల్లో భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.