నిడమర్రు మండల తహశీల్దార్‌గా ఎన్. రంగాలక్ష్మి బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నియమితులైన ఆమెకు డీటీ సాయి రమేష్, కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు ఘనంగా స్వాగతం పలికారు. రంగాలక్ష్మి మాట్లాడుతూ, సిబ్బంది సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.