ఉంగుటూరులో మండల విద్యా శాఖాధికారి శ్రీమతి నిమ్మగడ్డ రవీంద్ర భారతి చేతుల మీదుగా UTF వివిధ సబ్జెక్టులలో నిపుణులతో తయారు చేయబడిన SSC మోడల్ టెస్ట్ పేపర్స్ ఆవిష్కరించబడ్డాయి. గత 15 సంవత్సరాలుగా ఉంగుటూరు యూ టి ఎఫ్ మండలనాయకులు ఈ మోడల్ టెస్ట్ పేపర్స్ ను హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకొని మంచి మార్కులతో ప్రగతి సాధించాలని ఆమె విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, యూ టి ఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.