సోమవారం ఉదయం ఉంగుటూరు మండలం గోపినాదపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా, ఉద్యానవన శాఖ అధికారులు నాటు కోళ్ల పెంపకం విధానం గురించి ఆయనకు వివరించారు. మహిళలకు యూనిట్ల రూపంలో వీటిని అందజేసి, పెన్షన్ తర్వాత వాటిని కొనుగోలు చేయడం ద్వారా వారికి ఆదాయం సమకూరుతుందని అధికారులు తెలిపారు.