సోమవారం ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం గ్రామానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏలూరు జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక స్టాల్స్ ను పరిశీలించారు. ఉద్యానవన పంటలు పండిస్తున్న రైతులను కలిసి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.