డిఎంహెచ్వో తో ఉంగుటూరు ఎమ్మెల్యే భేటీ

1చూసినవారు
డిఎంహెచ్వో తో ఉంగుటూరు ఎమ్మెల్యే భేటీ
ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. శోభా మరియు వైద్యాధికారులతో ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో అమలవుతున్న వైద్య, ఆరోగ్య సేవలు, ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆయన ఆరా తీశారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు, ఆసుపత్రులను సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయడం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

సంబంధిత పోస్ట్