గొల్లగూడెం ఏఈ వేణు తెలిపిన వివరాల ప్రకారం, ఉంగుటూరు మండలం ఏ. గోకవరం, కైకరం విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. సబ్ స్టేషన్లలో మరమ్మతు పనులు చేపట్టడం వల్ల ఈ అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమాచారాన్ని గురువారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు.