
పెదకాపవరంలో పది అడుగుల కొండచిలువ కలకలం
ఆకివీడు మండలంలోని పెదకాపవరంలో గురువారం పది అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. స్థానికుడు బర్రె శ్రీనివాస్ ఇంటి వద్ద కనిపించిన ఈ కొండచిలువను అటవీశాఖ అధికారుల ఆదేశాలతో సిబ్బంది, వాలంటీర్లు చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా సహజ ఆవాస ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.





































