Apr 11, 2026, 15:04 IST/
హర్మూజ్‌ను దాటిన అమెరికా యుద్ధనౌకలు
Apr 11, 2026, 15:04 IST
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు అమెరికా యుద్ధనౌకలు హర్మూజ్ జలసంధిని దాటినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధం మొదలైన తర్వాత అమెరికా నౌకలు హర్మూజ్‌ను దాటడం ఇదే తొలిసారి. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.