Feb 11, 2026, 17:02 IST/
ప్రియుడి టార్చర్ తట్టుకోలేక నదిలో దూకిన యువతి (వీడియో)
Feb 11, 2026, 17:02 IST
ఉత్తరప్రదేశ్లోని మౌ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో గొడవపడి, ఆవేశంలో ఒక యువతి సరయూ నదిలోకి దూకేసింది. అయితే, నీరు గడ్డకట్టేంత చలిగా ఉండటంతో ఆత్మహత్య చేసుకునే ధైర్యం కాస్తా నీరుగారిపోయింది. ప్రాణభయంతో ఆమె వెంటనే తిరిగి ఒడ్డుకు రావడానికి ఈదడం ప్రారంభించింది. ఆమెను గమనించిన స్థానిక నావికులు తమ పడవతో అక్కడికి చేరుకుని, యువతిని సురక్షితంగా రక్షించి బయటకు తీసుకువచ్చారు.