
ఏలూరు: ఈ నెల 9న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
ఏలూరు స్ఫూర్తి భవన్లో బుధవారం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ నెల 9న జరగనున్న రాష్ట్రవ్యాప్త ఆందోళనను జయప్రదం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.






































