Apr 20, 2026, 14:04 IST/
రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ సుధాకర్ మృతి
Apr 20, 2026, 14:04 IST
AP: రాజంపేట సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విధి నిర్వహణకు వెళ్తున్న కానిస్టేబుల్ కే. సుధాకర్ రాజు (56) మోటార్ సైకిల్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రాజంపేట నుండి చిట్వేల్ వైపు వెళ్తుండగా పోలిచెరువు వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మృతుడు సుధాకర్ రాజు రాజంపేట పోలీస్ స్టేషన్లలో సుదీర్ఘకాలం పనిచేశారు.