Dec 30, 2025, 17:12 IST/బోథ్
బోథ్
ఆదిలాబాద్: పూణేలో ఆర్మీ జవాన్ మృతి
Dec 30, 2025, 17:12 IST
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని మర్లపెల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కాసర్ల వెంకటేష్ పూణేలో మంగళవారం మృతి చెందారు. ఈ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నట్లు తెలిసింది. ఆర్మీ జవాన్ మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.