Nov 10, 2025, 16:11 IST/
నలుగురు డాక్టర్ల అరెస్ట్: భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం
Nov 10, 2025, 16:11 IST
దేశంలో గత వారం రోజుల్లో ఉగ్రవాద వ్యతిరేక పోలీసులు విస్తృత దాడులు నిర్వహించి నలుగురు డాక్టర్లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 2900 కిలోల పేలుడు పదార్థాలు, రైఫిళ్లు, పిస్టల్స్, రిసిన్, అమోనియం నైట్రేట్ వంటి విష పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వైద్యులు జైషే ఏ మహమ్మద్, అన్సార్ గజ్వతుల్ హింద్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్లు విచారణలో తేలింది. వీరు సమాజంలో అనుమానం రాకుండా ఉగ్రవాద సంస్థలకు అందుబాటులో ఉంటూ దేశవ్యాప్తంగా దాడులకు ప్రణాళిక రచించినట్లు సమాచారం.