Mar 10, 2026, 17:03 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం: 8,135 మంది విద్యార్థుల హాజరు
Mar 10, 2026, 17:03 IST
ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని DIEO జాధవ్ గణేష్ కుమార్ తెలిపారు. మొత్తం 8,520 మంది విద్యార్థులకు గాను 8,135 మంది పరీక్షలకు హాజరయ్యారు. జనరల్ విభాగంలో 292 మంది, వొకేషనల్ విభాగంలో 93 మంది, మొత్తం 385 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.