
కొవ్వూరులో సంక్రాంతి కోడి పందాలు.. చేతులు మారిన లక్షలాది రూపాయలు
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శుక్రవారం కోడిపందాలు కోలాహలంగా జరిగాయి. పండుగ రెండవ రోజున జరిగిన ఈ పందాలు, గుండాట ఆటలలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. మహిళలు, చిన్నారులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమాలను అందరూ ఘనంగా జరుపుకున్నారు.





































