Feb 02, 2026, 15:02 IST/
వెండి ధరలు పతనం: కార్లలో వాడకం పెరిగిన నేపథ్యంలో ఆసక్తికరం
Feb 02, 2026, 15:02 IST
నవంబర్ 29న కిలో వెండి రూ.4 లక్షలు దాటి, మరుసటి రోజే రూ.80,000 పడిపోయింది. ప్రస్తుతం కిలో రూ.3 లక్షలకు చేరింది. ఆభరణాలతో పాటు పారిశ్రామికంగా, ముఖ్యంగా కార్లు, మొబైల్ ఫోన్లు, సోలార్ ప్యానెల్స్‌లో వెండి వాడకం పెరగడం ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెట్రోల్ కార్లలో 15-20 గ్రాములు, హైబ్రిడ్ కార్లలో 18-34 గ్రాములు, ఎలక్ట్రిక్ కార్లలో 25-50 గ్రాముల వెండిని ఉపయోగిస్తున్నారు. EVలలో వెండి వాడకం అధికంగా ఉంది. ఆటోమొబైల్ రంగంలో 2031 వరకు వెండికి డిమాండ్ పెరుగుతుందని అంచనా.