
మొగల్తూరు: పేకాట ఆడుతున్న 9 మంది అరెస్ట్
మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామ శివారులో శుక్రవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వై. నాగలక్ష్మి తెలిపారు. వారి నుంచి రూ. 25,660 నగదు, 52 పేక ముక్కలు, 112 కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.





































