
ఫిబ్రవరి 12న జరిగే ఉద్యోగ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలి
లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 12 గంటల పని విధానాన్ని అమలు చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జరగనున్న ఉద్యోగ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ నిడదవోలు గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు విజ్ఞప్తి చేశారు. గురువారం నిడదవోలులో లేబర్ కోడ్లను రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే లేబర్ కోడ్లను రద్దు చేశారని వారు మండిపడ్డారు.







































