
ప్రభుత్వం గుర్తించిన ఘాట్లలో మాత్రమే స్నానమాచరించాలి
ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక అయిన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. లోక కల్యాణం కోసం హాలాహలాన్ని మింగి, మంగళాన్ని ప్రసాదించిన ఆ పరమశివుని కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పుణ్యస్నానాలకు విచ్చేస్తున్న భక్తులు ప్రభుత్వం గుర్తించిన ఘాట్లలో మాత్రమే స్నానమాచరించాలని మంత్రి సూచించారు.






































