
తూర్పు గోదావరి వైసీపీ యువజన విభాగం కార్యదర్శిగా చాపర్ల రమేష్ నియామకం
తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్సీపి పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా చాపర్ల రమేష్ శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నియామకానికి గాను గోపాలపురం నియోజకవర్గ వైయస్సార్సీపి పార్టీ సమన్వయకర్త, మాజీ హోంమంత్రి తానేటి వనితకు రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నియామకం గోపాలపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.




































