నిడదవోలు - Nidadavole

సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్

సంస్కృతి సంప్రదాయాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టినిల్లు అని, వాటిని కాపాడడంలో గోదావరి జిల్లా వాసులు ముందుంటారని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కడియం మండలం కడియపులంకలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన రంగవల్లుల పోటీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు వందమంది చిన్నారులు, యువతులు, మహిళలు పాల్గొని వేసిన రంగవల్లులను ఎంపిక చేయడం న్యాయనిర్ణేతలకు కష్టంగా మారింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంక్రాంతిని పురస్కరించుకొని ఆలయ కమిటీ నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను అభినందించారు. మొదటి బహుమతిగా బంగారపు బిస్కెట్, ద్వితీయ తృతీయ బహుమతులుగా లగ్జరీ సోఫా కం బెడ్, వెండి ఆభరణాలు అందించారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా