Apr 15, 2026, 18:04 IST/
మహిళా రిజర్వేషన్ల అమలు.. రంగంలోకి కీలక నేతల వారసులు!
Apr 15, 2026, 18:04 IST
పార్లమెంటులో గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు దాదాపు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే వచ్చే ఎన్నికల్లో చట్టసభల్లో వారికి 33% సీట్లు కేటాయించాలి. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 180కి, పార్లమెంట్ స్థానాలు 28కి చేరనున్నాయి. వీటిలో 60 MLA, 8 వరకు ఎంపీ సీట్లు మహిళలకు కేటాయించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పలువురు కీలక నేతలు తమ భార్యలు, కోడళ్లను రాజకీయరంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయా పార్టీలకు ముందే హింట్ ఇస్తున్నట్లు టాక్.