
కొయ్యలగూడెం: వివాహానికి వచ్చి వ్యక్తి మృతి
శనివారం కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టి. నరసాపురం మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన పరిటాల నాగచంద్రరావు, రామానుజపురంలో తన అన్న కుమార్తె వివాహానికి వచ్చారు. ఇంటి పరిసరాలలో చెత్త తొలగిస్తున్న సమయంలో, ఇనుప ఊస అడ్డుగా ఉందని తొలగించే ప్రయత్నంలో 11 కె.వి విద్యుత్ వైర్లకు తగిలి షాక్కు గురై మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
































