
తణుకులో 'తెర'చుకున్న బరులు: పోలీసుల హెచ్చరికలు బేఖాతర్!
తణుకు నియోజకవర్గవ్యాప్తంగా బుధవారం కోడిపందేలు జోరుగా ప్రారంభమయ్యాయి. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో పందెంరాయుళ్లు బరులు సిద్ధం చేసి పందేలు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినా నిర్వాహకులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బరుల వద్ద జూద క్రీడలు కూడా జోరందుకోవడంతో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయని సమాచారం.





































