Apr 20, 2026, 17:04 IST/
ముంబయి ఇండియన్స్ ఘన విజయం
Apr 20, 2026, 17:04 IST
నాలుగు వరుస ఓటముల తర్వాత, ముంబై ఇండియన్స్ (MI) ఎట్టకేలకు విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ (GT)పై 99 పరుగుల తేడాతో గెలుపొందింది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో GT బ్యాటర్లు చేతులెత్తేయడంతో 100 పరుగులకే ఆలౌటయింది. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో అత్యధిక స్కోరు సాధించారు. సాయి సుదర్శన్, గిల్, బట్లర్, ఫిలిప్స్, తెవాటియా తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. MI బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లు తీయగా, శాంట్నర్, ఘజన్ఫర్ 2 వికెట్లు, బుమ్రా, పాండ్య తలో వికెట్ పడగొట్టారు.