
సైబర్ నేరాలపై అవగాహన అవసరం: శ్రీతేజ
తణుకులో సైబర్ సెక్యూరిటీపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డాన్ బాస్కో నవజీవన్ బాల భవన్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీతేజ మాట్లాడుతూ, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, అనధికారిక వెబ్సైట్ల నుండి ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు ఆయన తెలిపారు. మంగళవారం ఈ సదస్సు పిహెచ్సి నందు నిర్వహించబడింది.








































