
తణుకు: యువకుడు మృతి
ఇరగవరం మండలం కె.ఇంద్రపర్రుకు చెందిన గోపిశెట్టి రాంబాబు, సత్యవతి దంపతుల కుమారుడు సతీశ్ కుమార్ (28) గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందారు. విశాఖపట్నంలో హెచ్పీ సీ ఎల్లో ఉద్యోగం చేస్తున్న సతీశ్, ఇంటి నిర్మాణ పనులు చూసుకునేందుకు వారం రోజుల కిందట గ్రామానికి వచ్చారు. భవనం పైభాగంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మరణించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి, ఇంటిని నిర్మించి, వివాహం చేయాలనుకున్న తల్లిదండ్రుల కలలు కళ్లముందే ఆరిపోవడంతో వారు గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటనపై ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







































