
పరీక్షాపే రిజిస్ట్రేషన్లకు కోఆర్డినేటర్ల నియామకం
పశ్చిమ, ఏలూరు జిల్లాలకు పరీక్షాపే చర్చకు సంబంధించి జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు కోఆర్డినేటర్లను నియమించినట్లు దూబచర్ల డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి సోమవారం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకు ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్‌లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్ సంజీవ్‌లు ఎంపికయ్యారని చెప్పారు. ఈనెల 11 వరకు జరిగే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు.


































