
తణుకు: ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. ఆదివారం తణుకులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 36 కార్మిక చట్టాలను రద్దు చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.






































