
ఆకివీడు: అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మార్చురీ భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన జరిగింది. ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు పట్టణ టీడీపీ అధ్యక్షులు గంధం ఉమాసత్యనారాయణ, దాత, టీడీపీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.

































