
వీఆర్ఓలకు పనిభారం తగ్గించాలి: సంఘం అధ్యక్షులు
ఉండి మండలం వీఆర్ఓల సంఘం అధ్యక్షులు ఎస్ చిన్నారావు గ్రామ రెవిన్యూ అధికారులకు పనిభారం తగ్గించాలని కోరారు. యాప్‌లు పెరగడంతో ఒత్తిడి పెరిగి ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో ఎక్కడైనా హాజరు వేసుకునేలా వెసులుబాటు కల్పించాలని కోరుతూ ఎలక్షన్ డిటి రత్నకుమార్‌కు సోమవారం వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.







































