
మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శ
టీచర్ గా విశిష్ట సేవలు అందించిన వడూరి రత్నకుమార్ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో, శనివారం రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాలకొల్లులో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి రత్నకుమార్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి, ఆయన భార్య రాజామణిని ఓదార్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి.పార్థసారథి, మేరీ నిర్మల కుమారి కూడా పాల్గొన్నారు.







































