
ఎస్.ఐ. నసీరుల్లాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మానవత, లయన్స్ క్లబ్ సభ్యులు
ఆదివారం నాడు ఉండిలో మానవత సంస్థ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు, మానవత సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు ఎస్.ఐ. నసీరుల్లాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నసీరుల్లా నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయుస్సుతో జీవించాలని రంగరాజు ఆకాంక్షించారు. నాగబాబు, యువరాజు, రామలింగేశ్వరరావు, నరసరాజు, రంగప్రసాదరాజు, శివరామరాజు, రూత్ కళ వెంకటేశ్వరరాజు, మహంకాళి, హరనాధ్ రాజు తదితరులు కూడా నసీరుల్లాకు శుభాకాంక్షలు తెలియజేశారు.






































