May 21, 2026, 14:05 IST/
భారీగా పెరగనున్న మారుతి సుజుకీ ధరలు
May 21, 2026, 14:05 IST
మారుతీ సుజుకీ కార్ల ధరలు జూన్ నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అన్ని మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచనుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గత కొన్ని నెలలుగా వ్యయాల ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ నిరంతర ప్రయత్నాలు చేసిందని తెలిపింది. కానీ ప్రస్తుతం ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో.. కొంత మేర ధరలు పెంచినట్లు వివరించింది.