హత్యాయత్నం కేసుల్లో కేవలం నోటీసులివ్వడమేంటి? పోలీసులను నిలదీసిన హైకోర్టు

7337చూసినవారు
హత్యాయత్నం కేసుల్లో కేవలం నోటీసులివ్వడమేంటి? పోలీసులను నిలదీసిన హైకోర్టు
TG:  హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరాల్లో నిందితులను అరెస్టు చేయకుండా కేవలం నోటీసులు జారీ చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారతకుమారి తన కుమార్తెతో పాటు తనను హత్య చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, స్పష్టమైన ఆధారాలున్నా నిందితులను అరెస్టు చేయలేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కోడలు దీక్ష, సంధ్య బన్నూరి ఆహారంలో జోల్పిడెమ్‌ కలిపి హత్యాయత్నం చేశారని తెలిపారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది, నిందితుల్లో ఒకరు గర్భిణి కావడంతో నోటీసులు జారీ చేశామని, అరెస్టు అవసరమైతే చేస్తామని తెలిపారు. అయితే, ఈ వివరణతో సంతృప్తి చెందని న్యాయమూర్తి, అన్ని హత్యాయత్నం కేసుల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారా? అని ప్రశ్నిస్తూ, పూర్తి వివరాలతో ప్రత్యుత్తర అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్