AP: హోం మంత్రి వంగలపూడి అనిత, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తూ చురుగ్గా ఉంటున్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుపై ఆమె స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఐదు సెకన్ల రియాక్షన్‌తో సరిపెట్టడం, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ విషయంలో ఆమెకు ఆదేశాలున్నాయా లేక మరేదైనా కారణం ఉందా అనే చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఈ విషయంలో స్పందించం, మంత్రి అనిత మౌనంపై అనుమానాలను మరింత పెంచుతోంది.