ఐర్లాండ్‌తో రెండో
టీ20 మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చేసిన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎలక్ట్రోలైట్ వాటర్ తాగిన తర్వాత దాని రుచి నచ్చనట్లుగా అతడు ఇచ్చిన ముఖకవళికలు అభిమానులను ఆకట్టుకున్నాయి. తొలి టీ20లో తుది జట్టులో చోటు దక్కని వైభవ్‌కు ఈరోజు జరిగే రెండో మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలని అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.