AP: నెల్లూరులో మంత్రి నారాయణ కాలువలు, పాఠశాలల అధునీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన
వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "ఐదేళ్లలో
వైసీపీ నేతలు ఏం చేశారో చెప్పాలి.
వైసీపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ బెదిరింపులకు భయపడి అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదు.
వైసీపీ చీప్ పాలిటిక్స్‌కు అభివృద్ధితోనే సమాధానం చెబుతాం. పేద పిల్లలకు మంచి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు" అని మంత్రి నారాయణ అన్నారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.