వాట్సప్ యూజర్లకు సెర్ట్-ఇన్ హెచ్చరిక.. మాల్‌వేర్ ముప్పు!

9978చూసినవారు
వాట్సప్ యూజర్లకు సెర్ట్-ఇన్ హెచ్చరిక.. మాల్‌వేర్ ముప్పు!
కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (Cert-In) వాట్సప్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మాల్‌వేర్‌ను జొప్పించే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరించింది. విజువల్ బేసిక్ స్క్రిప్ట్ ఫైల్స్ (.vbs) ద్వారా ఈ దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికే హ్యాక్ చేసిన వాట్సప్ ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. అనుమానాస్పద అటాచ్‌మెంట్లను తెరిస్తే డివైజ్‌లు హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లి పాస్‌వర్డ్‌లు దొంగిలించబడే ప్రమాదం ఉందని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనుమానాస్పద అటాచ్‌మెంట్ల విషయంలో పంపిన వ్యక్తిని సంప్రదించి ధ్రువీకరించుకోవాలని Cert-In పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్