ఖాలీ కడుపుతో అరటి పండు మంచిది కాదు: నిపుణులు

9621చూసినవారు
ఖాలీ కడుపుతో అరటి పండు మంచిది కాదు: నిపుణులు
అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, శక్తిని అందిస్తాయి. అయితే, ఖాళీ కడుపుతో అరటి పండు తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. వ్యాయామానికి 30 నిమిషాల ముందు, తర్వాత తింటే కండరాల అలసట తగ్గుతుంది. సాయంత్రం స్నాక్స్ బదులు తింటే ఆకలి తగ్గి, కొవ్వు పెరగకుండా ఉంటుంది. రాత్రిపూట అరటి పండు తినడం వల్ల జీర్ణ సమస్యలు రావొచ్చు. మధుమేహం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు పరిమితంగా తీసుకోవాలి. ఆరోగ్యవంతులు రోజుకు 1-2 పండ్లు తినవచ్చు.

సంబంధిత పోస్ట్