AP: కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండున్నరేళ్ల చిన్నారి జాహ్నవి ఆచూకీ కోసం 27 రోజులుగా గాలింపు కొనసాగుతున్నా ఇప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. సి.ఆగ్రహారానికి చెందిన చిన్నారి కనిపించకుండా పోవడంతో కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. తన కుమార్తెను ఎవరైనా తీసుకెళ్లి ఉంటే సురక్షితంగా తిరిగి అప్పగించాలని, ఎలాంటి కేసులు పెట్టబోమని తల్లి భవానీ కన్నీటి విజ్ఞప్తి చేశారు. జాహ్నవి కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతిని కూడా ప్రకటించారు.