మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 22 ఏళ్ల మనోజ్ రజక్ అనే యువకుడు శుక్రవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులతో మాట్లాడుతూనే ఉన్నట్టుండి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న స్నేహితులు ఇంటికి చేరుకునేసరికే అతను మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.