చర్మంపై కనిపించే ప్రతి తెల్ల మచ్చ బొల్లి కాదని, పిట్రియాసిస్ ఆల్బా, శిలీంధ్ర ఇన్ఫెక్షన్లు, పోషకాహార లోపం వంటి అనేక ఇతర కారణాలు ఉండవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. పిల్లల్లో కనిపించే పిట్రియాసిస్ ఆల్బా చర్మం పొడిబారడం వల్ల వస్తుందంటున్నారు. ఇది మాయిశ్చరైజర్లతో తగ్గుతుందన్నారు. టినియా వెర్సికోలర్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ యాంటీ-ఫంగల్ క్రీములతో నయం అవుతుందంటున్నారు. విటమిన్ బి12, కాల్షియం, ఐరన్ లోపం వల్ల కూడా మచ్చలు రావచ్చు. బొల్లి మచ్చలు పాల రంగులో, స్పష్టమైన అంచులతో ఉంటాయంటున్నారు. సమస్య అధికంగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలన్నారు