ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండు దశల్లో
ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మొదటి దశలో పట్టణ స్థానిక సంస్థలు, రెండో దశలో గ్రామీణ సంస్థలకు
ఎన్నికలు జరుగుతాయి. ఈసారి మేయర్, జడ్పీ ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష
ఎన్నికలు జరగనుండటంతో ఆసక్తికరంగా మారింది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార, ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. ఈ ఎన్నికలను
వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలవాలని
వైసీపీ అధినేత
జగన్ ఆదేశించారు. కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో పైచేయి ఏ పార్టీ సాధిస్తుందనేది ఉత్కంఠగా మారింది.