ఉద్యోగి మరణించిన తర్వాత కూడా, ఉద్యోగి పెన్షన్ పథకం (EPS) కింద అర్హులైన కుటుంబ సభ్యులు నెలవారీ ఆదాయాన్ని పొందుతూనే ఉంటారు. ఒక పీఎఫ్ సభ్యుడు ఉద్యోగంలో ఉండగా మరణిస్తే, అతను పింఛను పథకానికి కేవలం ఒక నెల మాత్రమే వాటా చెల్లించినప్పటికీ, అతని కుటుంబానికి వెంటనే జీవితకాల నెలవారీ పింఛను భద్రతా పథకం అందుతుంది. సభ్యుడు మరణించిన తర్వాత అతని జీవిత భాగస్వామి జీవితాంతం లేదా పునర్వివాహం చేసుకునే వరకు పింఛను పొందుతారు.