AP:
వైసీపీ నాయకుడు జక్కంపూడి రాజా,
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. DSC మోసాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాపుల సంఖ్య బలం గురించి మాట్లాడిన పవన్, ఇప్పుడు వారితో తనకు పనిలేదని అంటున్నారని రాజా ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల పరిస్థితి చూసి వారు ఆవేదన చెందుతున్నారని, చంద్రబాబు, లోకేష్‌ల దగ్గర మార్కులు కొట్టేందుకే పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.