ఉప్పుకు గడువు తేదీ ఎందుకు? అసలు కారణాలు ఇవే!

2753చూసినవారు
ఉప్పుకు గడువు తేదీ ఎందుకు? అసలు కారణాలు ఇవే!
మార్కెట్లలో లభించే ఉప్పు ప్యాకెట్లపై ఎక్స్‌పైరీ డేట్ ఉండటంపై చాలామందికి సందేహాలు వస్తాయి. శాస్త్రీయంగా స్వచ్ఛమైన ఉప్పు ఎప్పటికీ చెడిపోదని, బ్యాక్టీరియాను నిరోధించే గుణం దానికి ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్యాకెట్లపై గడువు తేదీ ఇవ్వడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి ఉప్పులో కలిపే అయోడిన్ కాలక్రమేణా ఆవిరైపోవడం వల్ల పోషక విలువలు తగ్గడం. రెండు, ఉప్పు గడ్డకట్టకుండా వాడే యాంటీ-కేకింగ్ ఏజెంట్లు నిర్దిష్ట సమయం తర్వాత పనిచేయడం మానేయడం. గడువు దాటిన ఉప్పు విషపూరితం కాకపోయినా, అందులోని అయోడిన్ శాతం తగ్గిపోతుంది. ఉప్పును గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేసుకుంటే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్